సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (12:08 IST)

వారి అల్లరి హద్దుల్లో ఉంచాలి.. లేదంటే..?

పిల్లల బుడిబుడి నడకలు, ముద్దు ముద్దుగా చెప్పే మాటలు.. తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ ఓ స్థాయిని మించితే మాత్రం వారిని అదుపుచేయలేక విసుగు అనిపిస్తుంది. ఈ పరిస్థితికి దూరంగా వారి అల్లరి హద్దుల్లో ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు.. మరి ఆ జాగ్రత్తలేంటో ఓసారి తెలుసుకుందాం..
 
అతి నియంత్రణ, అతి గారాబం.. ఇవి రెండూ పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపించేవే. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు.. పిల్లల్ని ఈ వయసులో కాకుండా ఎప్పుడు అల్లరి చేస్తారని వెనకేసుకొస్తుంటారు. అదేమో నిజమే కానీ.. ప్రతిదానికి హద్దులు పెట్టడం మరిచిపోవద్దు. అప్పుడే వారికి అర్థమమవుతుంది. అలా కాకుండా ముందంతా వారి అల్లరిని ఉత్సాహపరచి చివర్లో క్రమశిక్షణ అంటే వారికి అర్థం కాకపోవచ్చు. చిన్నప్పటి నుండే వారు ఎలా ఉండాలో వారికి అర్థమవుతుంది.
 
సాధారణంగా భార్యాభర్తలు పిల్లల ముందే వారి పెంపకం విషయంలో, మరో అంశంలో ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఈ తీరు పిల్లల అల్లరిని అదుపుచేయలేని పరిస్థితిని తీసుకువస్తుంది. అందుకు కారణం.. ఎంత హద్దులు దాటినా ఎవరో ఒకరి పక్కన చేరిపోతే తప్పించుకోవచ్చని ఆలోచనతో ఉంటారు. దాంతో వారి అల్లరికి పగ్గాలే ఉండవు. కాబట్టి వాటిని అదుపుచేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.