సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (15:12 IST)

వారు జ్ఞాపకం పెట్టుకోవడం లేదంటూ..?

పిల్లల గురించి ఉపాధ్యాయులకు కొన్ని ఫిర్యాదులు ఉంటాయి. అవి ఏంటంటే.. పాఠశాలలో ఏది చెప్పినా మీ పాప లేదా బాబు జ్ఞాపకం పెట్టుకోవడం లేదంటూ తరగతి ఉపాధ్యాయులు చెపుతుంటారు. మరికొందరేమో ఏకాగ్రతగా విన్నా కూడా పాఠాలన్నీ గుర్తుండవు. ఇలాంటి చిన్నారుల్లో మార్పు రావాలంటే.. ఏం చేయాలో తెలుసుకుందాం..
 
పాఠశాలలో తరగతి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఉంటాయి కదా.. వాటికి సంబంధించిన ప్రశ్నలను పిల్లలను తయారు చేయమని చెప్పాలి. ఒకవేళ పాఠం అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చదవమని చెప్పాలి. అయినను అర్థం కాలేదంటే.. పాఠాన్ని ఉపాధ్యాయులను మళ్లీ నేర్పించమని చెప్పాలి. దాంతో ఆ పాఠంపై వారికి ఉండే సందేహాలు కూడా తీరిపోతాయి. అలానే మర్చిపోకుండా ఉంటారు.
 
పుస్తకాల్లో ఏదైనా కఠిన పదాలు గుర్తుండకపోతే.. వాటిని ఊహించుకుంటూ గుర్తుంచుకోమని చెప్పాలి. ఉదాహరణకు చెట్టు ఉందని.. దాన్ని ఊహించుకోవాలి. అలానే వాటికి సంబంధించిన వేరే పదాలు చేర్చి చెప్పినా కూడా మంచిదే. ముఖ్యమైన పదం జ్ఞాపకం రానప్పుడు రెండవ మెదడులోకి వస్తుంది. అంతే అసలు పదం దాని వెంటే మనసులో తడుతుంది.
 
ప్రతిరోజూ పిల్లలకు ఇంట్లో కూడా పాటలు, పద్యాలు వంటివి నేర్పిస్తుండాలి. వాటిని చెప్పించేటప్పుడు సరదాగా చెప్తే పిల్లలు వాటిని సులువుగా అర్థం చేసుకుంటారు. ఇది వారిలో జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదపడుతుంది.