మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:07 IST)

ఎక్కడుంటే అక్కడే ఓటేయాలి.. రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలామంది తమ తమ సొంత ఊర్లకు ప్రయాణమవుతుంటారు. ఓటర్ ఐడీ ప్రకారం ఏ ప్రాంతంలో ఓటును వేయాలో అక్కడికే వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశాడు.


ఏప్రిల్‌తో పాటు మే నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికల సమయంలో తాము ఎక్కడ వుంటే అక్కడే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు అశ్విన్‌ ప్రధానికి ట్వీట్‌ చేశాడు. 
 
ఎన్నికలు జరిగే సమయంలో ఐపీఎల్‌ జరుగుతోంది. దానిలో భాగంగా భారత జట్టు దేశంలోని వివిధ నగరాల్లో ఆడవలసి వస్తుంది. ఈ పోటీలు జరిగే సమయంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు తాను నివసించే పట్టణంలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల క్రికెటర్లకు ఓటు వేసే అవకాశం ఉండదు. అయితే, తాము ఓటు తప్పని సరిగా వేయాలి. 
 
అందుకే తామున్న చోట్లోనే ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రధానిని కోరారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని అశ్విన్‌ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. మరి అశ్విన్ విజ్ఞప్తిపై ప్రధాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.