గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (17:05 IST)

'అలకనంద' వైపే మొగ్గుతున్న మాటల మాంత్రికుడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఒక సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైన విషయం అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథతో కూడిన ఈ సినిమాలో... కథానాయికగా పూజా హెగ్డేని, మరో కీలకమైన పాత్ర కోసం 'టబు'ని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకి మొదట 'నాన్న నేను' అనే టైటిల్ అనుకున్నప్పటికీ... ఇప్పుడు తాజాగా 'అలకనంద' అనే టైటిల్‌ను కూడా త్రివిక్రమ్ పరిశీలిస్తున్నాడట.
 
సెంటిమెంట్‌లకు పెద్ద పీట వేసే సినీ ఇండస్ట్రీలో... త్రివిక్రమ్‌కి ఇటీవలి కాలంలో తన సినిమా టైటిల్స్ అన్నీ 'అ' తో మొదలుపెట్టడం సెంటిమెంట్‌గా మారిపోయింది. ఆయన ఇటీవలి సినిమాలు ఒక్క 'అజ్ఞాతవాసి' మినహా 'అత్తారింటికి దారేది', 'అ ఆ', 'అరవింద సమేత' భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. 
 
అందువల్ల ఆ సెంటిమెంట్‌ను అలాగే కొనసాగిస్తూ, ఈ సినిమాకి 'అలకనంద' అనే టైటిల్‌ను పెట్టాలని ఆయన అనుకుంటున్నాడనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ పేరుతో సినిమాలో కనిపించబోయేది పూజా హెగ్డేనా? 'టబు'నా? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.