సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (19:00 IST)

బన్నీ, త్రివిక్రమ్ చిత్రంలో విలన్‌గా 'దేశముదురు' భామ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. వీరిద్దరి కాంబోలో ఈ చిత్రం ముచ్చటగా మూడో చిత్రం కానుంది.


వీరిద్దరూ హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమైయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రసూల్ పురలో రెగ్యులర్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో డీజే భామ పూజా హెగ్దే మరోసారి బన్నీకి జోడిగా నటిస్తోంది. బాలీవుడ్ భామ టబు మరో కీలక పాత్ర చేస్తున్న సంగతి విదితమే.
 
ఈ చిత్రంలో మరో యంగ్ హీరోయిన్ కూడా నటిస్తోంది. దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల హన్సిక మరోసారి బన్నీతో నటించనుంది. అయితే ఆమెది హీరోయిన్ రోల్ మాత్రం కాదట. నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్‌ను ప్లే చేస్తున్నట్లు సమాచారం.

కథ విని నెగెటివ్ పాత్రైనా తాను చేయడానికి సిద్ధమంటూ ఓకే చెప్పిందట. ఈ దేశముదురు హీరోయిన్ నెగెటివ్ రోల్‌ను ఎలా చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.