శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:14 IST)

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో ఆయన కూడానా!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా రానున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నారట. కాగా... తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది.
 
ఈ చిత్రంలోని ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నానా పటేకర్‌ని తీసుకోనున్నారనీ... ఈ మేరకు పటేకర్‌తో చిత్రయూనిట్ సంప్రదింపులు కూడా జరిపుతోందనీ సమాచారం. ప్రస్తుతానికైతే ఈ విషయమై దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు కానీ... ఇదే నిజమైతే ఆ సినిమాకు ఆయన కూడా ఒక పెద్ద అసెట్ అవుతాడనే ఆశ పడుతున్నారు ప్రేక్షకాభిమానులు.