శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (14:26 IST)

రాహుల్ రవీంద్రన్ మరో త్రివిక్రమ్ కాగలడా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. దర్శకుడిగా కంటే ముందుగా త్రివిక్రమ్ తన పవర్‌ఫుల్ డైలాగులతోనే తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆలరించాడు. అలాంటి సినిమాలలో "మన్మథుడు" కూడా ఒకటి. నాగ్ కెరీర్లో ఇది బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. కాగా, నాగ్ ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు.
 
"చిలసౌ" సినిమాతో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో "మన్మథుడు 2" తెరకెక్కబోతోంది. ప్రీ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 25వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభంకాబోతోంది. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా 'మన్మథుడు' సినిమాను తలపించేలా ఉంటుందని రాహుల్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 
 
కథ, కథనాలైతే సరేగానీ... మరి మాటల మాంత్రికుడి కలం నుంచి జాలువారే మాటలను, త్రివిక్రమ్‌ని తలపించడం ఎవరివల్ల సాధ్యమవుతుందో.. ఎంత మేరకు తలపిస్తారో ఆ వివరాలే తెలియాల్సి ఉందంటున్నారు టాలీవుడ్ జనం.