మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (12:39 IST)

మల్టీస్టారర్ మూవీలతో రెచ్చిపోతున్న ముదురు హీరో!

విక్టరీ వెంకటేష్ మరో మల్టీ స్టారర్ చేయనున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది... టాలీవుడ్‌లో కాకపోతే ఈసారి రవితేజతోనట. వివరాలలోకి వెళ్తే... మహేష్ బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్ కల్యాణ్‌తో 'గోపాల గోపాల', తాజాగా వరుణ్ తేజ్‌తో 'ఎఫ్2' సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.
 
ఈ నేపథ్యంలో వెంకీ మల్టీస్టారర్‌లకే మొగ్గు చూపుతున్నాడట. తాజాగా, దర్శకుడు వీరు పోట్ల వెంకీ కోసం ఓ మల్టీ స్టారర్ కథను సిద్ధం చేసాడట. ఈ చిత్రంలో వెంకీ, రవితేజ కలిసి నటించనున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలోనే ఉందనీ... త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుందనే టాక్‌లో ప్రస్తుతం టాలీవుడ్‌లో వినపడుతోంది. మరోవైపు, వెంకీ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.