అల్లు అర్జున్‌కి అమ్మగా నటిస్తున్న 'నిన్నేపెళ్లాడుతా' తార..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ & హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని ఎనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఉగాది రోజున (ఏప్రిల్ 6) ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నది.
అల్లు అర్జున్ సరసన నాయికగా పూజా హెగ్డే ఎంపిక చేసారు. తాజా వార్త ఏంటంటే.. అర్జున్ తల్లి పాత్రకు టబు నటించే అవకాశాలున్నాయనే ప్రచారం గుప్పుమంది. ఇప్పటికే టబును త్రివిక్రమ్ సంప్రదించి కథ వినిపించాడనీ, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అనీ వినిపిస్తోంది. అయితే ఆమె తప్పకుండా ఒప్పుకుంటుందని త్రివిక్రమ్ నమ్మకంగా ఉన్నారట. 18 సంవత్సరాల క్రితం వెంకటేష్ కి జంటగా నటించిన కూలీ నెం 1తో తెలుగు సినిమాల్లోకి నాయికగా ఆమె అడుగుపెట్టింది.
నాగార్జున సరసన చేసిన నిన్నే పెళ్లాడుతా సినిమాతో యూత్‌లో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రేమదేశం సినిమాతో లక్షలాదిమందిని తన ప్రేమలో పడేసింది టబు. ఆమె తెలుగులో నటించిన చివరి సినిమా చంద్రసిద్ధార్థ్ డైరెక్ట్ చేసిన ఇదీ సంగతి. మరి..ఈ సినిమాకి ఆమె ఓకే చెబుతుందో లేదో చూడాలి.