మద్యానికి బానిస.. రోజూ తలనొప్పి.. కన్నకుమారుడినే కడతేర్చింది..

Last Updated: శనివారం, 16 మార్చి 2019 (13:05 IST)
మద్యానికి బానిసైన కొడుకు రోజూ తాగివచ్చి పెడుతున్న ఇబ్బందులు భరించలేక ఓ తల్లి కన్నబిడ్డను చేతులారా హత్యచేసింది. అల్లుడితో కలిసి కొడుకును చంపేసింది. ఈ ఘటన హైదరాబాద్ ఫిలిమ్ నగర్ నవనిర్మాణ్ నగర్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రతిరోజూ తాగి రావడం.. కొడుకు రోజూ తాగివచ్చి పెడుతున్న ఇబ్బందు భరించలేక ఆమె అతనిని చంపేయాలనుకుంది. 
 
ఇందుకోసం అల్లుడి సాయం తీసుకుంది. అల్లుడి సహకారంతో కన్నబిడ్డను హత్య చేసింది. రోజూ చుక్కలేకుంటే కుమారుడికి పొద్దుగడవదని.. అందుకు డబ్బు కావాలని హింసించేవాడని.. ఆ బాధ తాళలేకే కన్నకొడుకును హతమార్చిందని పోలీసులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :