శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (10:02 IST)

కుటుంబం మొత్తం అంత పని చేసిందా..? కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందు?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. క్షణికావేశాలు ఆత్మహత్యలకు, హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం, అల్లినగరం గ్రామానికి చెందిన జక్కా రాఘవేంద్ర నాగరాజు (45) బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. 
 
కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. కానీ చేసిన అప్పులు పీకల మీదకు రావడంతో పాలుపోని స్థితిలో కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సభ్యులంతా కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 
 
ఈ ఘటనలో నాగరాజు, ఆతని భార్య ఈశ్వరి, కుమార్తె వైష్ణవి చనిపోగా, మరో కుమార్తె వరలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధలతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేకుంటే.. వేరేదైనా కారణం వుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.