గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (16:51 IST)

టాయిలెట్లో దూరి మహిళను వివస్త్రను చేసి ముద్దులు... ఆపై బుగ్గను కొరికేశాడు...

ఓ వ్యక్తి మహిళల టాయిలెట్లో దూరి ఒక స్త్రీపై అఘాయిత్యం చేయబోయాడు. వస్త్రాలు లేక ఆ మహిళ బయటకు రావడానికి ఇబ్బంది పడింది. ఈ ఘటన బుర్‌ దుబాయ్‌లోని బిజినెస్‌ బే ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న మహిళ టాయిలెట్‌కి వెళ్లింది. ఆమె వెళుతున్న సమయంలో అదే ఆఫీసులో పనిచేసే సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ తనని వెంబడించాడు. 
 
ఆమె టాయిలెట్‌లో దూరగానే అతను కూడా అందులో దూరి తలుపులు వేసాడు. ఆ మహిళ బట్టలు చించి వివస్త్రను చేశాడు. ఆపై ఆమె శరీరంపై ముద్దులు పెడుతూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ఎంత ప్రతిఘటించడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బుగ్గను కొరికి గాయం కూడా చేశాడు. చివరకు తలుపు వద్ద ఏదో అలికిడి వినిపించడంతో అక్కడ నుండి పరారయ్యాడు. 
 
నగ్నంగా ఉన్న మహిళ బయటకు రాలేక ఇబ్బంది పడింది. వెంటనే పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించింది. పోలీసులు ఆఫీసుకు చేరుకున్నారు. అదే విధంగా స్నేహితురాళ్లకు కూడా సమాచారం అందించడంతో వారు ఆఫీసుకు బట్టలు తెచ్చిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు న్యాయమూర్తి నేరస్తుడికి మార్చి 25న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపారు.