1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Hyderabad crime news

సినీ అవకాశాలు ఇప్పిస్తానని, గెస్ట్ హౌస్‌కి రమ్మన్నాడు..ఆ తర్వాత ఏమైంది?

Hyderabad
యువతీయువకులకు సినిమా అవకాశం ఇప్పిస్తామని చెప్పి, వారి నుండి డబ్బును అలాగే లైంగిక వాంఛలను తీర్చుకున్న కామాంధులు అనేక మంది ఉన్నారు. ఇలాంటి ఘటనే మరోసారి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. సినిమా పరిశ్రమలో అవకాశాలు కల్పిస్తానని సినిమాటోగ్రాఫర్‌ షన్ముఖ్‌ వినయ్‌ ఓ యువతిని మోసం చేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే..బోడుప్పల్‌కి చెందిన ఓ యువతి సినీ అవకాశాల కోసం వినయ్‌ని కలిసింది. ఈ సందర్భంగా బాధితురాలికి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. సినిమా ఛాన్స్ పేరిట మాదాపూర్‌లోని ఓ గెస్ట్‌ హౌస్‌కు బాధితురాలిని పిలిపించుకుని, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనవరిలో జరిగింది, అయితే ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
బాధితురాలు గట్టిగా నిలదీయడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని వినయ్ మభ్య పెట్టాడు. ఆ తర్వాత వినయ్ ముఖం చాటేయడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వినయ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు రేప్ కేసును నమోదు చేసినట్లు మాదాపూర్ ఏసీపీ ప్రసాద్‌రావు తెలిపారు. నిందితుడు వినయ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపినట్లు ఆయన వెల్లడించారు.
About Writer
మోహన్
తర్వాతి కథనం
బ్యాగులో బాంబు వుందని జోక్ చేసింది.. అంతే.. కోర్టులో నిలబెట్టారు..