శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (17:45 IST)

సర్‌ప్రైజ్ ధరకు ఎల్.ఈ.డీ టీవీ...

ఇప్పటివరకు భారత్‌లోని మొబైల్ మార్కెట్‌లపై మాత్రమే దాడి చేసిన డ్రాగన్ కంపెనీలు ఇప్పుడు టెలివిజన్ మార్కెట్‌పై కూడా దాడి చేస్తున్నాయి. మొబైల్ మేకర్ దిగ్గజం షియోమీ అతి తక్కువ ధరకే ఎంఐ టీవీ 4 సిరీస్‌ టీవీలను అందుబాటులోకి తీసుకువచ్చి సృష్టించింది. ఈ ప్రకంపనలు ఆగకమునుపే చైనాకే చెందిన మరో కంపెనీ కొత్త ప్రకంపనలు సృష్టించనుంది. 
 
వివరాలలోకి వెళ్తే... తాజాగా చైనాకే చెందిన షింకో మరింత అద్భుతమైన ధరలలో అతిపెద్ద ఎల్‌ఈడీ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఎస్ఓ4ఎ 39 అంగుళాల ఎల్‌ఈడీ టీవీని రూ.13,990కే మార్కెట్లోకి విడుదల చేసి ప్రకంపనలను సృష్టించింది. హెచ్‌డీ రిజల్యూషన్ కలిగిన ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. 
 
4కె ప్లేబ్యాక్‌కు సపోర్టు చేస్తుంది. యూఎస్‌బీ టు యూఎస్‌బీ ఫైల్ ట్రాన్స్‌ఫర్, 20 వాట్స్ స్పీకర్, ఎనర్జీ సేవింగ్ ఫీచర్ ఉన్నాయి. సర్వీసింగ్, ఇన్‌స్టాలేషన్, మరమ్మతుల వంటివాటి కోసం ఆండ్రాయిడ్ యాప్‌‌ను కూడా షింకో అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో షింకో ఎల్‌ఈడీ టీవీ (24 అంగుళాలు) ప్రారంభ ధర రూ.6,490. గరిష్టంగా... 65 అంగుళాల టీవీ ధర రూ.59,990.