శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (10:59 IST)

మహేశ్ బాబును కూడా వదలవా శ్రీరెడ్డి... ఫ్యాన్స్ నుండి ఊహించని స్పందన

తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దల వార్నింగ్‌తో హైదరాబాద్‌ను వీడి చెన్నైకు మకాం మార్చిన నటి శ్రీరెడ్డి కొద్దికాలం మిన్నకుండిపోయింది. ఇపుడు మళ్లీ వివాదాల జోలికి వెళుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు పోటీగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి వీడియోలను తెగ పోస్ట్ చేస్తోంది. ఇక ఏపీలో పొలిటికల్ ఫీవర్ స్టార్ట్ కావడంతో మకాం పూర్తిగా ఇక్కడికి మార్చేసి వివిధ అంశాల గురించి చర్చలు జరుపుతూ, సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో నచ్చినవారిపై ప్రశంసలు, నచ్చనివారిపై విమర్శలు గుప్పిస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. 
 
తాజాగా ఫ్యామిలీ మ్యాన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతోంది. ఫేస్‌బుక్‌లోని తన వాల్‌లో మహేశ్ బాబు ఫోటో పోస్ట్ చేసి, ఆయన సినిమాలలో చాలా స్ఫూర్తిదాయకమైన సబ్జెక్ట్‌లను ఎంచుకుంటారు. మీలో ఎంత మంది అతనిని రాజకీయాలకు ఆహ్వానిస్తారు, ఇంకా ఏ పార్టీ అతనికి తగినది?? ఆయన సబ్జెక్ట్‌లకు, సింప్లిసిటీకి నేను ఫ్యాన్‌ను.. అంటూ పోస్ట్ పెట్టారు. 
 
ఈ పోస్ట్‌కు మహేష్ బాబు అభిమానుల నుండి చాలా త్వరగా ప్రతిస్పందనలు అందాయి. కొందరు వైసీపీ సూటవుతుందని, మరికొందరు టీడీపీ బెటరని వ్యాఖ్యానించగా, ఇంకొందరేమో మా అన్నను లాగకు బాబూ అంటూ వేడుకున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలలో ఆయన పాలిటిక్స్ విషయంగా మీడియాలో అడిగిన ప్రశ్నలకు.. తాను రాజకీయాలలోకి ఎప్పటికీ రానని, సినిమా రంగంలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు.