మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (15:38 IST)

మీ తమ్ముడు సీఎం ఐతే ఏం పొడుస్తాడు... కన్నెపిల్లలందరినీ... శ్రీరెడ్డి ఫైర్

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల యూట్యూబ్‌లో ఛానెల్ పెట్టి పలు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా, వైసిపి, టిడిపి పార్టీలను విమర్శిస్తూ పెడ్తున్న వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ఇటీవల చంద్రబాబుకు రాజకీయాల నుండి రిటైర్మెంట్ కల్పిస్తామంటూ వ్యంగ్యంగా ఓ వీడియో రూపొందించారు. దీనికి కౌంటర్ ఇస్తూ శ్రీరెడ్డి పెట్టిన వీడియో సంచలనంగా మారింది.
 
నాగబాబు పోస్ట్ చేసిన వీడియోలో చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకోవాలని ఏదేదో చెప్తున్నాడు. మీకు కౌంటర్ ఇవ్వడానికి నేనున్నానుగా అంటూ మొదలుపెట్టిన శ్రీరెడ్డి "చంద్రబాబుగారు చివరి శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటానన్నారు. ఎందుకు అంత శ్రమ. మీరు వదిలి పెడితే మెగా ఫ్యామిలీ అంతా కలిసి తమ్ముడిని సీఎం చేయడానికి రెడీగా ఉన్నారు. సరే.. మీరు చెప్పినట్టే చంద్రబాబుగారు తప్పుకుంటే, అంత అనుభవం ఉన్న నాయకుడు ఇంకెవరు ఉన్నారు ఏపీలో... మీ తమ్ముడా? అతడు సీఎం అయినా ఏం పొడుస్తాడు. రాష్ట్రంలో ఉన్న కన్నె పిల్లలందరిని పెళ్లి చేసుకుంటాడా లేక సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తాడా" అంటూ మండిపడింది.
 
ఇంతకు ముందు కాంగ్రెస్ నుండి మూటల డబ్బు అందింది. ఇక ఇప్పుడు మీ తమ్ముడు సిఎం అయితే ఆంధ్ర అంతా కంపెనీలు పెట్టుకుంటారా? చంద్రబాబు వయస్సు 70 ఏళ్లు, కాబట్టి రిటైర్ కావాలంటున్నావు, మరి నీ వయస్సు 60 ఏళ్లు, ఈ వయస్సులో పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసుకోకుండా జబర్దస్త్‌లో ఆ వెకిలి నవ్వులెందుకు, ఎవరెవరికో ఫోన్లు చేసి కొడుకుకు సినీ ఆఫర్స్ ఇప్పించడమెందుకు, ఎలాగూ మెగా ముద్రతో బతికేస్తాడులే అంటూ ప్రశ్నించింది. అంతటితో ఆగకుండా చిరంజీవి షష్టిపూర్తి అయ్యాక కూడా ఇంకా రిటైర్ కాకుండా సినిమాలెందుకు చేస్తూ కష్టపడుతున్నారు. వీటన్నింటికీ మీ దగ్గర సమాధానం ఉందా అంటూ ప్రశ్నించారు శ్రీరెడ్డి.