సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 7 మార్చి 2019 (20:22 IST)

ద్యావుడా.. ఒరేయ్ వంకరగా... ఒసేయ్ ఆంబోతు శ్రీరెడ్డి... ఎందుకు?

ప్రధాన ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతల మధ్య తీవ్రస్థాయిలో విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రధాన పార్టీలకు చెందిన అధినేతల విషయాన్ని అటుంచితే క్రిందిస్థాయిలో ఉన్న నేతలు, కొంతమంది కార్యకర్తలు, మరికొంతమందైతే నటులు ఏకంగా బూతులు తిట్టేసుకుంటున్నారు. అది కూడా వినలేని మాటల్లో. 
 
తాజాగా శ్రీరెడ్డి, జనసేన పార్టీకి చెందిన దిలీప్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. టిడిపి మహిళా నేత యామినిని ఉద్దేశించి దిలీప్ సుంకర కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో యామినికి అండగా నిలబడింది శ్రీరెడ్డి. ఒరేయ్ కుక్క. నువ్వు సీటులో కూడా సరిపోవు. నీ సైజు ఎంతరా. నీకు దమ్ముంటే ఒక ఛానల్‌లో ఇద్దరం కలిసి డిబేట్‌కు కూర్చుంటాం రా. నీ బండారం బయటపెడతాను.. మహిళలంటే అంత చిన్న చూపా అంటూ దిలీప్ సుంకరపై వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.
 
దీంతో దిలీప్ సుంకర, శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.... ఒసేయ్.. శ్రీరెడ్డి.. ఊర కుక్క.. నువ్వు కూడా మాట్లాడుతావు. నీకు ఎవరి దగ్గరనైనా విలువ ఉందా. టిడిపి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావు. యామినికి లేని కోపం నీకెందుకు అంటూ చెడామడా తిట్టేశాడు దిలీప్ సుంకర. వీరిద్దరి మధ్య నడుస్తున్న మాటల యుద్ధంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.