సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2019 (19:28 IST)

కౌశల్ గుడ్డలిప్పదీస్తే అసలు నిజం తెలుస్తుంది... శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్ పైన ఉద్యమం చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా మరోసారి విరుచుకపడుతోంది. ఐతే ఈసారి సినిమావాళ్లను వదిలేసి బుల్లితెర నటులపై పడింది. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ గురించి ఆమె మాట్లాడుతూ... '' గుండె ధైర్యం చేసుకుని వినండి. ఆర్మీ అంటారు, కౌశల్ ఆర్మీ అంటారు. ఆర్మీ అంటే ఎన్ని త్యాగాలు చేయాలో తెలుసా మీకు.
 
ఆర్మీ ఏంట్రా? సంఘం అని పెట్టుకుని చావండి. ఏం పీకారని ఆర్మీ. ఆ వ్యక్తి ఏమయినా గొప్పోడా? ఆర్మీ అనేది తొలగించాలి లేదంటే మీకు మంచిగ వుండదు బిడ్డా. నేను కౌశల్ పైన స్టింగ్ ఆపరేషన్ చేశా. నాలుగు సంవత్సరాల క్రితం ఓ అమ్మాయితో వున్నాడు. నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు.
 
కాంప్రమైజ్ కావాలని ఆ అమ్మాయిని అడిగావా లేదా. కౌశల్ గుడ్డలిప్పదీస్తే అసలు నిజం తెలుస్తుంది. అనేకమంది స్త్రీల విషయాల్లో తలదూర్చావు. నా సంగతి తెలియదు అన్నీ బయటపెడతా'' అంటూ వ్యాఖ్యలు చేసింది.