శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (21:04 IST)

పవన్ కళ్యాణ్‌ ఏమైనా పెద్ద పుడుంగా...? ఎవరు?

ఒక సాధారణ యాక్టర్‌కు అత్యున్నత స్థాయి బహుమతి ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఆ యువనటుడికి మంచి పేరు వచ్చింది. ఆ పేరును నిలబెట్టుకుంటారని అందరూ భావించారు. కానీ ఒక హీరోను కించపరుస్తూ మాట్లాడాడు ఆ యువనటుడు. దీంతో అభిమానులు ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. యువ నటుడి ఫ్లెక్సీని చెప్పులతో కొడుతూ ఊరేగించారు. ఇదంతా ఎక్కడో కాదు విజయవాడలో జరిగింది.
 
యువ నటుడు కౌశల్, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్‌ అభిమానుల మధ్య జరిగిన రాద్దాంతమే ఇదంతా. పవన్ కళ్యాణ్‌ గత కొన్నిరోజుల ముందు ఒక హోటల్‌లో బస చేశారు. ఆ హోటల్లోనే కౌసల్‌కు రూం బుక్ చేశారు అతని స్నేహితులు. అయితే ఆ రూం తనకు వద్దని వేరే హోటల్ రూం తీసుకుంటానని హేళనగా మాట్లాడాడు. 
 
పవన్ కళ్యాణ్‌ ఏమైనా పెద్ద పుడుంగా అంటూ అన్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చింది పవన్ అభిమానులకు. కౌశల్ దిష్టిబొమ్మలను ఎక్కడిపడితే అక్కడ తగులబెడుతున్నారు. అయితే తాను అలా అనలేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కౌశల్. మరి పవన్ ఫ్యాన్స్ వింటారో లేదో చూడాలి.