సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 11 మార్చి 2019 (20:07 IST)

సారీ మహేష్ బాబు గారూ... ఎవరూ... ఎందుకో తెలుసా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ సినిమా చేయాల‌నుకోవ‌డం... వీరిద్ద‌రి మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం తెలిసిందే. అయితే.. ఊహించ‌నివిధంగా సుకుమార్.. బ‌న్నీతో సినిమా చేస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేయ‌డంతో అస‌లు ఏం జ‌రిగింద‌నేది హాట్ టాపిక్ అయ్యింది. మ‌హేష్‌, సుకుమార్ మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్స‌స్ రావడంతో ఇలా జ‌రిగింది. సుకుమార్‌తో సినిమా చేయ‌డం లేదు. సుకుమార్‌కి ఆల్ ది బెస్ట్ అని మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్లో స్పందించారు. 
 
ఆ త‌ర్వాత సుకుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ ఆలోచ‌న‌లో పడ్డారు. రీసెంట్‌గా మ‌హేష్ బాబుని సుకుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌ల్లో ఒక‌రైన న‌వీన్ మ‌హ‌ర్షి షూటింగ్ స్పాట్లో కలిసార‌ట‌. సుకుమార్ మ‌హేష్ బాబుకి సారీ కూడా చెప్పార‌ట‌. భ‌విష్య‌త్‌లో వీరిద్ద‌రు క‌లిసి వ‌ర్క్ చేసినా చేయ‌పోయినా రిలేష‌న్ మాత్రం చెడిపోకూడ‌ద‌నే ఉద్దేశ్యంతో ఇలా స్మూత్‌గా డీల్ చేసార‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మ‌రి... వివాదం స‌మసిపోయింది కాబ‌ట్టి మ‌ళ్లీ క‌థ చెప్పి ఒప్పిస్తాడేమో చూడాలి.