గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2019 (20:39 IST)

మహేష్ బాబు కోసం నమ్రతకు కథ చెప్పిన కేజీఎఫ్ డైరెక్టర్... రిజల్ట్ ఏంటి?

కెజిఎఫ్‌ సినిమా ఏ రేంజ్‌లో విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. యాష్ హీరోగా ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది. అంతేకాదు దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను తెలుగు, తమిళం, కన్నడ సినీపరిశ్రమలో టాప్ డైరెక్టర్ల టాప్ స్థాయికి తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ మరికొన్ని సినిమాలపై దృష్టి పెట్టారు.
 
ఈసారి టాప్ మోస్ట్ సినీప్రముఖులపైనే ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగులో మహేష్ బాబు కోసం ప్రశాంత్ నీల్ ఒక కథను సిద్థం చేయడమే కాకుండా ఆ కథను స్వయంగా ఆయన సతీమణి నమ్రతకు వివరించారట. కథను విన్న నమ్రత చాలా బాగుందని చెప్పిందట. అంతేకాదు మహేష్ కాల్షీట్లు తాను తీసిస్తానని, ఈ సినిమాలో ఖచ్చితంగా ఆయన నటిస్తారని హామీ కూడా ఇచ్చిందట. 
 
ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్థమవుతున్నారు మహేష్ బాబు. ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎక్కడా ఖాళీ లేకుండా సినిమాలు కంటిన్యూగా చేయాలన్నది మహేష్ ఆలోచన. అందుకే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు ఆయన ముందడుగు వేస్తారని తెలుస్తోంది.