శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 7 మార్చి 2019 (16:47 IST)

మ‌హేష్ బాబుకి నిద్ర లేకుండా చేసిన వంశీ పైడిప‌ల్లి..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తోన్న తాజా చిత్రం మ‌హ‌ర్షి. స‌క్స‌ెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో హీరోయిన్‌గా పూజా హేగ్డే న‌టిస్తుంటే... కీల‌క పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల‌న‌ అనుకున్న డేట్‌కి రిలీజ్ చేయ‌డం కుద‌ర‌డం లేదు. ఏప్రిల్ 25న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అని చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు ప్ర‌క‌టించారు.
 
దిల్ రాజు అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ మ‌హ‌ర్షి ఏప్రిల్‌లో రావ‌డం లేదు. జూన్ నెలకి వాయిదా ప‌డింద‌ట‌ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లపై ఇటీవ‌ల చిత్ర‌యూనిట్ స్పందించింది. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల్లో వాస్త‌వం లేదు. ఏప్రిల్ 25న మ‌హ‌ర్షి రిలీజ్ ప‌క్కా అంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేసారు. దీంతో మ‌హ‌ర్షి రావ‌డం ప‌క్కా అనుకున్నారు కానీ.. ఏమైందో ఏమో కానీ... మ‌ళ్లీ మ‌హ‌ర్షి పోస్ట్‌పోన్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి.
 
ఆఖ‌రికి ఆ వార్త‌లు నిజ‌మే అయ్యాయి. నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ... మ‌హ‌ర్షి చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తున్నాం అని ప్ర‌క‌టించారు. అయితే.. మే నెల మ‌హేష్ బాబుకు క‌లిసి రాలేదు. నిజం, నాని బ్ర‌హ్మోత్స‌వం చిత్రాలు మే నెల‌లో రిలీజ్ అయ్యాయి. డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. దీంతో మ‌హ‌ర్షి సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లోనే ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాల‌ని మ‌హేష్ ప‌ట్టుపట్టాడు కానీ.. కుద‌ర‌లేదు. మే 9న రిలీజ్ చేస్తున్నారు. దీంతో రిజెల్ట్ ఎలా ఉంటుందో అని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట‌. మ‌రి.. ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో చూడాలి.