శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (13:52 IST)

''అర్జున్ రెడ్డి'' దర్శకుడికి నో.. మహేష్ బాబు.. ఎందుకు?

''అర్జున్ రెడ్డి'' సినిమా ఎంతమేరకు హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే పనిలో వున్నాడు. అయితే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో కూడా అర్జున్ సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఈ సినిమాకు మహేష్ బాబు నో చెప్పినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ప్రిన్స్ కోసం కోసం తాను సిద్ధం చేసిన కథను ఇటీవల ఆయనకి సందీప్ రెడ్డి వినిపించాడట. హీరో క్యారెక్టరైజేషన్ తన బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా లేదని మహేశ్ బాబు చెప్పినట్టుగా సమాచారం. అయితే ఇప్పటికిప్పుడే ఈ సినిమాను పక్కనబెట్టినా.. మళ్లీ సందీప్‌తో మహేశ్ సినిమా చేసే అవకాశం వున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియాలంటే వేచి చూడాలి మరి.