శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (17:25 IST)

మహిళా దర్శకురాలు అనుమానాస్పద మృతి

తిరువనంతపురంలో 28 యేళ్ళ మహిళా సినీ దర్శకురాలు నయన సూర్యన్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈమె వయసు 28 యేళ్లు. ఎన్నో యేళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ గత 2017 నుంచి దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈమె దర్శకత్వ బాధ్యతలు స్వీకరించకముందు అనేక మంది దర్శకులతో అసిస్టెంట్‌గా పని చేశారు. నయనకు ఆమె తల్లి పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో... ఆమె కంగారుపడి, వెంటనే నయన స్నేహితులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపింది. నయన ఇంటికి వెళ్లిన స్నేహితులకు... పడకగదిలో ఆమె విగతజీవిగా కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఆమె మృతిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, పోస్ట్ మార్టం నివేదిక అందితే కానీ, మృతికి గల కారణాలను చెప్పలేమని తెలిపారు. గత కొంత కాలంగా మధుమేహ వ్యాధికి ఆమె చికిత్స పొందుతోందని తెలిపారు. ఈమెకు తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉన్నారు.