శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (09:19 IST)

సినీ పీఆర్వో బీఏ రాజు భార్య, సినీ దర్శకురాలు బి. జయ హఠాన్మరణం

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈయన అంత్యక్రియలు ముగిసీ ముగియకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మహిళా దర్శకురాలు బి. జయ (54) క

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈయన అంత్యక్రియలు ముగిసీ ముగియకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మహిళా దర్శకురాలు బి. జయ (54) కన్నుమూశారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో చనిపోయారు.
 
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకురాలు బి.జయ (54) గుండెపోటుతో గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో మృతి చెందారు. ఈమె భర్త ప్రముఖ సినీ పాత్రికేయుడు, సినీ పీఆర్వో బీఏ రాజు. 
 
2003లో వచ్చిన చంటిగాడు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయ.. తొలుత ఓ జర్నలిస్టు. అయితే, సినిమాలపై మక్కువతో ఆమె దర్శకత్వ రంగంవైపు అడుగుపెట్టారు. 
 
'ప్రేమికులు', 'గుండమ్మగారి మనువడు', 'సవాల్'‌, 'లవ్లీ', 'వైశాఖం' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కామ్నా జెఠ్మలానీ, శాన్వి, సుహాసిని వంటి కథానాయికలను పరిచయం చేసింది జయనే. 
 
ఆంగ్ల సాహిత్యం, సైకాలజీలో ఎం.ఏ చేసిన జయ తొలుత సినీ పాత్రికేయురాలిగా పనిచేశారు. ఆ తర్వాత మెగాఫోన్ చేపట్టి ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమె తీసిన ఆఖరు చిత్రం 'వైశాఖం'. ఆమె అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు పంజగుట్ట శ్మశాన వాటికలో జరుగనుందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.