మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 30 ఆగస్టు 2018 (18:49 IST)

రెంట్ షేర్ ద్వారా అద్దెకు హై ఎండ్ ల్యాప్‌టాప్‌లు... నెల అద్దె ఎంతో తెలుసా?

హైదరాబాద్: భార‌త‌దేశం మ‌రియు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో ఆన్‌లైన్ ప్రొడక్ట్ రెంట‌ల్ మార్కెట్ ప్లేస్‌లో ప్ర‌ముఖ స్థానంలో ఉన్న `రెంట్ షేర్‌` హైఎండ్ ల్యాప్‌ట్యాప్‌ల‌ను కూడా అద్దెకు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌ద్వారా విస్తృత శ్రేణిలో ఉన్న త‌న అద్ద

హైదరాబాద్: భార‌త‌దేశం మ‌రియు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో ఆన్‌లైన్ ప్రొడక్ట్ రెంట‌ల్ మార్కెట్ ప్లేస్‌లో ప్ర‌ముఖ స్థానంలో ఉన్న `రెంట్ షేర్‌`  హైఎండ్ ల్యాప్‌ట్యాప్‌ల‌ను కూడా అద్దెకు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌ద్వారా విస్తృత శ్రేణిలో ఉన్న త‌న అద్దె వ‌స్తువుల జాబితాను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చింది. ఐటీ ప‌రిశ్ర‌మ‌కు కావాల్సిన స‌మ‌గ్ర‌మైన మౌలిక‌ స‌దుపాయాల‌ను అందించ‌డం ద్వారా సాంకేతిక రంగంలో విప్ల‌వాత్మ‌క పరిణామంలో కీలక పాత్ర పోషించిన రెంట్ షేర్ ఈ క్ర‌మంలోనే అత్యున్న‌త బ్రాండ్‌ల ల్యాప్‌ట్యాప్‌ల‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతోంది. ఇంటెల్ జియాన్‌, ఆపిల్ మ్యాక్‌బుక్ వంటి విశిష్ట ఉత్పాద‌న‌ల ద్వారా త‌న వినియోగ‌దారులకు స‌మ‌గ్ర‌మైన అద్దె వ‌స్తువుల జాబితా మ‌రియు సుల‌భ‌మైన పరిష్కారాల‌ను రెంట్ షేర్ అందిస్తోంది.
 
రూ.1.2 ల‌క్ష‌ల నుంచి మొద‌లుకొని రూ. 2.4 ల‌క్షల వ‌ర‌కు ధ‌ర క‌లిగిన ఈ హై ఎండ్ సిస్ట‌మ్‌లు సమర్థవంతమైన విద్యుత్ సరఫరా సామర్థ్యం, అత్యుత్త‌మ‌మైన బ్యాట‌రీ లైఫ్‌, సాటిలేని సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంటాయి. రెంట్ షేర్ ద్వారా ఈ లగ్జ‌రీ ల్యాప్‌ట్యాప్‌లను వినియోగ‌దారులు నెల‌కు రూ.4990- 16,000 వ‌ర‌కు అద్దె చెల్లించి త‌మ కార్య‌క‌లాపాల్లో వినియోగించుకోవ‌చ్చు. కోర్ i3 కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగి ఉన్న ల్యాప్ ట్యాప్‌ల అద్దె ధ‌ర నెల‌కు స‌హ‌జంగానే రూ. 1680 ఉండగా, కోర్ i7, 16జీబీ ర్యామ్ క‌లిగి ఉన్న హైఎండ్ మ్యాక్‌బుక్ వంటి వాటికి రూ.8,500 వ‌ర‌కు ఉంటుంది. దీంతోపాటుగా టాప్ ఆఫ్ ది మోడ‌ల్స్ అయిన‌ జియాన్ ఆక్టా (కోర్ ర్యాక్ స‌ర్వ‌ర్ 128 జీబీ ర్యామ్ & 600 జీబీ ఎస్ఏఎస్ హెచ్‌డీడీ) నెల‌వారి అద్దె రూ. 30,000 ఉంటుంది. నామ‌మాత్ర‌పు ధ‌ర‌లోనే అత్యున్న‌త నాణ్య‌త‌ గల ఉత్పాదనలను అందిస్తున్న రెంట్ షేర్, వృత్తి నిపుణులు త‌మ అత్యున్‌ త ప్ర‌తిభ‌ను అన్ని రంగాల్లో అందించేందుకు మ‌రియు గ‌రిష్ట ఉత్పాద‌క‌త‌ను వెలువ‌రించేందుకు త‌న సేవ‌ల‌ను అందిస్తోంది.
 
రెంట్ షేర్‌ త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించినప్ప‌టి నుంచి ల్యాప్‌ట్యాప్‌ల‌కు పెద్ద ఎత్తున డిమాండ్ వ‌చ్చింది. చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా కంపెనీలే కాకుండా స్టార్ట‌ప్‌లు కూడా త‌మ నిర్వ‌హ‌ణ వ్య‌యాల‌ను త‌గ్గించుకునే క్ర‌మంలో ల్యాప్‌ట్యాప్‌ల‌ కోసం సంప్ర‌దించాయి. దీంతోపాటుగా ఫ్రీలాన్స‌ర్లు మ‌రియు క‌న్స‌ల్టెంట్లు వివిధ అసంఘ‌టిత ప్రాజెక్టులు చేసే క్ర‌మంలో మ‌రియు సైడ్ ప్రెన్యూర్లుగా ఉండి 9-5 ఉద్యోగాలు చేస్తూనే మ‌రిన్ని వ్యాపారాలను ఏక‌కాలంలో చేస్తున్న క్ర‌మంలో నామ‌మాత్ర‌పు ధ‌ర‌, అత్యుత్త‌మ నాణ్య‌త క‌లిగిన ల్యాప్‌ట్యాప్‌లు దొర‌క‌డం అదే స‌మ‌యంలో విశ్వ‌స‌నీయ‌మైన వినియోగ‌దారుడి రూపంలో త‌మ‌కు అనుకూల‌మైన అద్దె వ్య‌వ‌ధిలో ద‌క్క‌డం ప‌ట్ల వినియోగ‌దారులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.
 
ఆర్థిక విప‌ణిలో చోటుచేసుకుంటున్న పురోగామి మార్పుల వ‌ల్ల వ‌స్తున్న డిమాండ్ నేప‌థ్యంలో రెంట్ షేర్ అందుకు త‌గిన రీతిలో త‌న సేవ‌ల‌ను అందిస్తోంది. ఒక‌రోజు వ్య‌వ‌ధి, వారం వ్య‌వ‌ధి అద్దె సౌల‌భ్యం మొద‌లుకొని అనేక నెల‌ల వ్య‌వ‌ధి వ‌ర‌కు అద్దెకు తీసుకోవ‌చ్చు. ఇలా విభిన్న‌మైన సేవ‌లు అందించ‌డం వ‌ల్ల కొత్త త‌రం టెక్నాల‌జీ అవ‌స‌రాలైన హ్యాక‌థాన్లు, వీడియో షూటింగ్‌లు, స్కైప్ ఇంట‌ర్వ్యూల‌కు సంబంధించిన ప్ర‌క్రియ‌ల్లో త‌మ అవ‌స‌రాల‌కు త‌గిన రీతిలో ల్యాప్‌ట్యాప్‌ల‌ను పొందే అవ‌కాశం ద‌క్కుతోంది.
 
రెంట్ షేర్‌కు చెందిన సాటిలేని సేవ‌లు ప‌ది ప్ర‌ధాన న‌గ‌రాల్లో అందుబాటులోకి ఉన్నాయి. ఐటీ హ‌బ్‌లుగా పేరొంది ఐటీ హ‌బ్‌లుగా నిలిచిన బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, ఢిల్లీ మ‌రియు ముంబై వంటివి ఇందులో ఉన్నాయి. విశిష్ట‌మైన మ‌రియు వినియోగ‌దారుల అవ‌స‌రాలు తీర్చే విధంగా రెంట్‌షేర్ రూపొందించిన ప్లాట్‌ఫాం ద్వారా వినియోగదారులు ఎలాంటి ల్యాప్‌ట్యాప్‌లు అందుబాటులో ఉన్నాయ‌ని ఆరా తీయాల్సిన అవ‌స‌రం లేకుండా రెంట్ షేర్ తమ వద్ద అందుబాటులో ఉన్న వాటినే లిస్ట్ చేసి ఉంచ‌డం వ‌ల్ల వెంట‌నే బుకింగ్ చేసుకోవ‌చ్చు. లో-ఎండ్ సిస్ట‌మ్‌లు 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే డెలివ‌రీ అవుతుండ‌గా... హై ఎండ్ సిస్ట‌మ్‌లకు డెలివ‌రీకి ముందు వివిధ ద‌శ‌లు ఉండే నేప‌థ్యంలో 48-72 గంట‌ల స‌మ‌యంలో వినియోగ‌దారుల‌కు చేర‌వేస్తున్నారు. ఉత్ప‌త్తుల‌ను అద్దెకు అందించే ఏకైక కంపెనీగా గుర్తింపు పొందిన రెంట్‌షేర్ ఒక్క సిస్టం అయినా, భారీ స్థాయిలో అవ‌స‌రాలు అంటే 100 సిస్ట‌మ్‌ల వ‌ర‌కు అయినా అదే నిర్దేశిత స‌మ‌యంలో వినియోగ‌దారుల‌కు చేర‌వేస్తోంది.
 
రెంట్‌షేర్ ప్ర‌ణాళిక‌బ‌ద్ద‌మైన వేదిక ద్వారా ఆవిష్క‌ర‌ణ‌ల‌కు సంబంధించిన‌ ఉత్ప‌త్తులు, ప్ర‌త్యేక‌మైన వినియోగ‌దారుల సేవ‌లు మ‌రియు స‌మ‌గ్ర‌మైన అద్దె వ్య‌వ‌హారాల‌ను పేర్కొంటుండ‌టం వ‌ల్ల ఉత్ప‌త్తుల అద్దె విప‌ణ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకుంది. అత్యున్న‌త‌మైన వినియోగ‌దారుల అనుభూతిని పొందే క్ర‌మంలో పూర్తి నాణ్య‌త‌తో సేవ‌లు అందించే కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగిన ల్యాప్‌ట్యాప్‌లు మ‌రియు వినియోగ‌దారుల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు క‌లిగించ‌ని ఉత్పత్తుల‌ను అంద‌జేస్తోంది. రెంట్ షేర్‌కు చెందిన ఉన్న‌త‌మైన ప‌రిజ్ఞానం క‌లిగిన టెక్నిక‌ల్ టీం అందించే విస్ప‌ష్ట‌మైన స‌ల‌హాల వ‌ల్ల వినియోగ‌దారులు త‌మ అవ‌స‌రానికి త‌గిన ల్యాప్‌ట్యాప్‌ను ఎలాంటి ఇబ్బందులు, అన‌వ‌స‌ర ప్ర‌యాస లేకుండా సొంతం చేసుకోవ‌చ్చు.
 
ప్ర‌స్తుతం రెంట్‌ షేర్ మొత్తం ఆదాయంలో 25% ఐటీ మౌలిక స‌దుపాయాల వ‌ల్లే వ‌స్తున్నాయి. ఐటీ రంగంలో ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ పెర‌గ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూ భార‌త‌దేశం యొక్క స్టార్ట‌ప్ విజ‌య‌గాథ‌లు కొన‌సాగే అవ‌కాశం స్ప‌ష్టంగా ఉన్న నేప‌థ్యంలో రాబోయే మూడేళ్ల కాలంలో 150-200% వృద్ధి రేటు ఉంటుంద‌ని ఆశిస్తోంది. 
 
రెంట్ షేర్ గురించి 
రెంట్‌షేర్ ఆన్‌లైన్ రెంట‌ల్ మార్కెట్ కేంద్రం. ఎల‌క్ట్రానిక్స్‌, మెడిక‌ల్ ఎక్వీప్‌మెంట్, అప్ప‌రెల్స్‌, కెమెరా లెన్సులు, ఈవెంట్ల‌కు సంబంధించిన ఉప‌క‌రణాలు వంటివి అద్దెకు ఇస్తోంది. దీంతోపాటుగా అనేక మంది ఆఫ్‌లైన్ మార్కెట్ అమ్మ‌కందారుల‌ను ఒక్క‌తాటిపైకి తేవ‌డం ద్వారా వారికి ఆన్‌లైన్‌లో అనేక వ్యాపార అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. 2015లో ప్రారంభ‌మైన రెంట్ షేర్ ఐఐటీ మ‌రియు ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌ట్ట‌భ‌ద్రులు అయిన హ‌ర్ష్‌దండ్ మాన‌స‌పుత్రిక‌. బెంగ‌ళూరులో ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న రెంట్ షేర్ పార‌ద‌ర్శ‌క‌త‌, సుల‌భంగా ఉప‌యోగించుకోగ‌లిగిన వెసులుబాటు, అద్దెకు అన్ని సేవ‌లు అందించ‌డం మ‌రియు సామాజిక అంశాల‌కు త‌గిన రీతిలో అద్దెకు సంబంధించిన సేవ‌లు అందించ‌డం మ‌రియు ప్ర‌చారం క‌ల్పించ‌డం చేస్తోంది. రెంట్‌షేర్‌కు 2015లో రూ.2 కోట్ల సీడ్ ఫండ్ ద‌క్కింది. 
 
మెకెన్సీకి చెందిన మాజీ పెట్టుబ‌డిదారుడు వైభ‌వ్ దోషితో పాటుగా ఇత‌ర ఎంట‌ర్‌ప్రెన్యూర్ కం ఇన్వెస్ట‌ర్లు అయిన ఇన్‌మొబీ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు అభ‌య్ సింగ‌ల్‌, యునికామ‌ర్స్ కోఫౌండ‌ర్ మ‌రియు సీఓఓ విభుగార్గ్‌, నింబూజ్ సీఓఓ జోబీ బాబు, ఫిలిప్స్ ఇండియా జీఎం అభిషేక్ ఆచార్య‌, విప్రో యూకేకు చెందిన మనీష్ షా ఈ రౌండ్‌లో భాగ‌స్వామ్యం పంచుకున్నారు. నిర్వహణ ప‌రంగా భారం ప‌డ‌ని మ‌రియు వ్యాపార‌ప‌రంగా లాభార్జ‌న‌కు సాధ్య‌మైన అంశాల‌తో రెంట్‌షేర్ త‌న ప్ర‌యాణాన్ని ముందుకు తీసుకుపోతోంది. ఉత్ప‌త్తుల‌ను అద్దెకు అందించ‌డం సుల‌భ‌త‌రం మ‌రియు అంద‌రికీ అనువుగా ఉండ‌టమ‌నే ప్ర‌క్రియ‌ల‌తో రెంట్ షేర్ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటోంది.