మహేశ్ బాబుకు చేదు అనుభవం... 5 గంటలు ఎదురుచూసినా లాభం లేదు

ప్రీతి| Last Updated: మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:26 IST)
మహేష్ బాబు నటిస్తున్న "మహర్షి" చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రైతు సమస్యల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం చేస్తున్నారు. పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా భాగం మిగిలి ఉండటంతో అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. 'మహర్షి' సినిమా షూటింగ్ భాగంగా శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మహేష్‌కు చేదు అనుభవం ఎదురైందట.

హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ఆదివారం హైజాక్ బెదిరింపులు వచ్చాయి. దీనితో అప్రమత్తమైన పోలీసులు విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. కొన్ని విమానాలను కూడా రద్దు చేశారు. 'మహర్షి' సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం విమానాశ్రయ అధికారుల నుండి ముందుగానే అనుమతి తీసుకున్న 'మహర్షి' టీం ఆ రోజున మహేష్ బాబుపై షూటింగ్ చేయవలసి ఉంది.

అందుకోసం మహేష్ బాబు ఆదివారం రోజు ఉదయం 7:30 గంటలకే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు, కానీ హైఅలర్ట్ ఉన్నందువలన విమానాశ్రయ అధికారులు వీరిని లోపలికి అనుమతించలేదట. మహేష్ బాబు తన క్యారావాన్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. చిత్ర యూనిట్ ఎంతగా రిక్వెస్ట్ చేసినా అధికారులు అనుమతివ్వలేదట. అప్పటికే 5 గంటల పాటు క్యారావాన్‌లో ఎదురుచూసిన మహేష్ విసిగిపోయి ఇంటికెళ్లిపోయాడట.దీనిపై మరింత చదవండి :