టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకి అరుదైన గౌరవం.. అదేంటంటే?
సూపర్‌స్టార్ మహేశ్ బాబుకి మరో అరుదైన అవకాశం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆయన మైనపు విగ్రహాన్ని రూపొందించింది. ఈ మైనపు విగ్రహాన్ని మార్చి 25న మహేశ్ స్వయంగా హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్ వేదికగా ఆవిష్కరించనున్నాడు. ఆ తర్వాత విగ్రహాన్ని సింగపూర్‌కి తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు.
టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు ఒక విగ్రహాన్ని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మహేశ్‌కి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.
దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా పూజా హెగ్దే ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. భరత్ అనే నేను చిత్రం భారీ విజయాన్ని నమోదు చేయడంతో మహర్షి సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ చిత్రం ఏప్రిల్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.