బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 14 ఫిబ్రవరి 2019 (19:18 IST)

మ‌హేష్ - సుకుమార్ మూవీ ఉందా..? లేదా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్.. సుకుమార్‌తో సినిమా చేయాల‌నుకున్నారు. సుకుమార్ ఇటీవ‌ల మ‌హేష్ బాబుకి క‌థ చెప్పార‌ట. కానీ... ఆ క‌థ పూర్తి స్ధాయిలో మ‌హేష్‌కి న‌చ్చ‌లేద‌ట‌. దీంతో సుకుమార్ వేరే స్టోరీ లైన్ చెప్పార‌ట‌. కాక‌పోతే ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ‌డానికి ఆరు నెల‌ల టైమ్ కావాల‌ని చెప్పాడట‌.
 
దీంతో మ‌హేష్.. సుకుమార్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే లోపు అనిల్ రావిపూడితో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీ మ‌హేష్‌కి బాగా న‌చ్చ‌డంతో త్వ‌ర‌గా ఫుల్ స్టోరీ రెడీ చేయ‌మ‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. అయితే.. అనిల్ రావిపూడి క‌న్నా ముందుగా సుకుమార్ స్టోరీ రెడీ చేస్తే.. సుకుమార్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉంద‌ట‌. మ‌రి... సుక్కు త్వ‌ర‌గా స్టోరీ రెడీ చేస్తాడా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.