నితిన్ సినిమాకి ముహుర్తం ఖ‌రారు.!

Nitin-Megha
శ్రీ| Last Modified సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (20:06 IST)
యువ హీరో నితిన్ లై, ఛ‌ల్ మోహ‌న రంగా, శ్రీనివాస క‌ళ్యాణం చిత్రాల‌తో ఫ్లాప్స్‌లో హ్యాట్రిక్ సాధించాడు. దీంతో కెరీర్లో వెన‌క‌బ‌డిన నితిన్ ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ... నితిన్‌కి భుజం గాయం కారణంగా కొన్ని నెలలుగా కెమెరా ముందుకు రాలేదు. భీష్మా టైటిల్‌కి ది బ్యాచిలర్‌ అనేది ట్యాగ్ లైన్. అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల 25న స్టార్ట్‌ చేయనున్నారట.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పైన నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నితిన్ స‌ర‌స‌న రష్మికా మందన్నా హీరోయిన్‌గా ఖ‌రారు చేసారు. ఛలో తరహాలోనే ఈ భీష్మా కూడా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ప్లాన్‌ చేశారట. ఈ సినిమా త‌ర్వాత కుమారి 21ఎఫ్‌ ఫేమ్‌ సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మించనున్న ఓ సినిమాను నితిన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలతో నితిన్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడేమో చూడాలి.దీనిపై మరింత చదవండి :