సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (20:04 IST)

రాహుల్ గట్స్ కామెంట్స్.. మీ సర్టిఫికేట్ అవసరం లేదన్న గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీలో మీరొక్కరే గట్స్‌వున్న వ్యక్తి.. అంటూ కామెంట్ చేశారు. దయచేసి రాఫెల్ స్కామ్, అనిల్ అంబానీ, రైతుల అసహాయతపై కూడా స్పందించండి అంటూ ట్వీట్‌లో గడ్కరీని రాహుల్ గాంధీ కోరారు. 
 
ఇంటిని, ఇల్లాలిని చూసుకోలేని వ్యక్తి దేశాన్ని ఏం కాపాడుతాడంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. నిజానికి బీజేపీ కోసం పని చేయాలని అనుకుంటున్న వ్యక్తిని ఉద్దేశించి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ.. గడ్కరీకి అభినందనలు తెలియజేశారు. 
 
అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నితిన్ గడ్కరీ స్పందించారు. గట్స్ కామెంట్స్‌పై గడ్కరీ స్పందిస్తూ.. తనకు రాహుల్ గాంధీ సర్టిఫికేట్ అవసరంలేదన్నారు. తన సామర్థ్యంలో రాహుల్ జీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఏదేమైనా, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, మా ప్రభుత్వంపై దాడి చేసేందుకు మీరు మీడియాలో వక్రీకరించే వార్తల కోసం ఆశ్రయిస్తారని భావిస్తున్నానని దెప్పిపొడిచారు.
 
ఇదిలా వుంటే.. రిపబ్లిక్ డే వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పక్కనే కూర్చున్న గడ్కరీ.. ఆయనతో చాలా సమయం పాటు సీరియస్‌గా చర్చించడం కనిపించింది. ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.