గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (12:39 IST)

రాహుల్.. 18 ఏళ్లు దాటిన వారికి శృంగారాన్ని ఫ్రీగా ఇచ్చినా ఇస్తారు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మద్దతురాలు, రచయిత అయిన మధు పూర్ణిమ కిష్వార్.. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమైనాయి. రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించి ప్రస్తుతం నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. పేదలకు కనీస వేతనం తప్పనిసరి చేస్తామని హామీ ఇచ్చారు. 
 
రాహుల్ ఇచ్చిన హామీపై ప్రశంసలు గుప్పించారు. అయితే బీజేపీ మాత్రం రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం పూర్ణిమా కిష్వార్ రాహుల్ హామీని విమర్శిస్తూ ట్వీట్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. 
 
ప్రజలు వేచి వుండాలి.. ప్రతీ ఏడాది పరిమిత రోజులకు 18 ఏళ్లు పైబడిన పురుషులకు ఉచిత సెక్స్ కూడా ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినా ఇస్తారని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ మద్దతుదారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెసేతరులు, నెటిజన్లు కూడా మధుపూర్ణిమ ట్వీట్‌పై మండిపడుతున్నారు.