శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:09 IST)

భారత్ పద్ధతేం బాగోలేదు.. ఇలాగైతే కష్టం.. ఒలింపిక్ కమిటీ

భారత్‌పై ఒలింపిక్ కమిటీ ఫైర్ అయ్యింది. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్ షూటర్లకు భారత్ వీసాలు నిరాకరించడంపై ఐవోసీ మండిపడింది. భారత్ నిర్ణయంతో భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్‌తో చర్చలు నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది. 
 
ఢిల్లీలో జరగనున్న ప్రపంచకప్‌ పోటీల నుంచి పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్‌ ఈవెంట్‌కు ఒలింపిక్‌ అర్హత హోదాను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. భారత్‌ తీరును తప్పుబట్టిన ఐవోసీ...అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అన్ని దేశాల అథ్లెట్లను, క్రీడా ప్రతినిధులను సమానంగా చూడాలని హితవు పలికింది. 
 
అథ్లెట్ల మధ్య ఆతిథ్య దేశం ఎలాంటి వివక్ష చూపకూడదని.. ఆటల్లో దేశ రాజకీయాలకు చోటే లేదని.. భారత్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతోనే ఆ దేశంతో ఒలింపిక్స్‌కు ఆతిథ్యంపై చర్చలను ఆపేయాలని నిర్ణయించినట్లు ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. 
 
ఒలింపిక్‌ నిబంధనలకు అనుగుణంగా వివిధ దేశాల పోటీదారులకు అనుమతి ఇస్తామని భారత సర్కార్ నుంచి లిఖితపూర్వకమైన హామీ వచ్చేంత వరకు ఒలింపిక్‌ సంబంధింత పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేసింది.