శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Vasu
Last Modified: సోమవారం, 24 సెప్టెంబరు 2018 (15:23 IST)

మారుతీ రావు చేయించిన హత్య కథ... ఆవిధంగా ముందుకెళుతోంది...

ఒక్క మారుతీరావు చేయించిన హత్య కథని, ఈ రాజకీయాలు, టీవీ ఛానెళ్లు ఎంత దూరానికి తీసుకెళ్తున్నాయో ఇంకా ఏమేమి చేయిస్తాయోనని జనాలు నోళ్లు నొక్కేసుకుంటున్నారు. తామెంతో అపురూపంగా చూసుకుంటున్న తమ బిడ్డలు తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసి మోసం చేసి పెళ్లిళ్లు చే

ఒక్క మారుతీరావు చేయించిన హత్య కథని, ఈ రాజకీయాలు, టీవీ ఛానెళ్లు ఎంత దూరానికి తీసుకెళ్తున్నాయో ఇంకా ఏమేమి చేయిస్తాయోనని జనాలు నోళ్లు నొక్కేసుకుంటున్నారు. తామెంతో అపురూపంగా చూసుకుంటున్న తమ బిడ్డలు తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసి మోసం చేసి పెళ్లిళ్లు చేసుకొని కడుపు తెచ్చుకొని ఆ తర్వాత విషయాన్ని బయటపెడితే ఆ కడుపు మంటతో ఆవేశంలో కూడా మళ్లీ తన బిడ్డని కాకుండా పక్కవారి బిడ్డని హత్య చేయించాడని కొంతమంది సమర్ధిస్తున్నప్పటికీ, తను చేసింది తప్పేనని మారుతీరావు ఆమోదించడం కూడా పరిగణించాల్సి ఉంది. ఇది ముమ్మాటికే తప్పే, కాదని మనిషనే వాడెవ్వడూ చెప్పడు.
 
కాగా, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను, సరిహద్దుల్లో అమరులవుతున్న సైనికులను పెద్దగా పట్టించుకోని ప్రభుత్వాలు ఈ విషయాన్ని మాత్రం ఇంతగా పట్టించుకోవడంలో కేవలం మీడియా అత్యుత్సాహమనే విమర్శలు మొదలయ్యాయి. ఆవేశంలో జరిగిన ఒక హత్యకు పూర్తిగా ఒక జాతిపై, ఒక కులంపై అగ్రవర్ణాల దాడి అనే రేంజ్‌లో రంగులద్దడంలో టిఆర్‌పీ రేటింగ్‌ల వేటగాళ్లు బాగానే సఫలీకృతులవుతున్నారంటూ కామెంట్లు వస్తున్నాయి.
 
అయితే, జాతీయ నాయకుల నడుమ హతుడి కాంస్య విగ్రహాన్ని (దానికి కూడా ఒక ఎమ్మెల్యే హామీ ఇచ్చేసారనుకోండి) ఏర్పాటు చేయడం ద్వారా భావి తరాలకు ఏ విధమైన సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారో కూడా నాయకులు పునరాలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.
 
విచారించిన పోలీసు అధికారులే అది పరువు హత్య కాదు మొర్రో అంటున్నా... పరామర్శల పేరుతో, ధన సహాయం పేరుతో, రాజకీయ తెరంగేట్రాల పేరుతో జరుగుతున్నది ఏమిటో సదరు ఓటరు మహాశయులకి తెలియని విషయమైతే కాదు.