శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (16:06 IST)

పరువు కోసం మారుతీరావే చావాలి... రాంగోపాల్ వర్మ

రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య. ఆర్యవైశ్యవర్గానికి చెందిన అమ్మాయిని ఓ దళిత యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక

రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య. ఆర్యవైశ్యవర్గానికి చెందిన అమ్మాయిని ఓ దళిత యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన అమ్మాయి తండ్రి.. తన అల్లుడుని కిరాయి మనుషులకు రూ.కోటి సుపారీ ఇచ్చి హత్య చేయించాడు.
 
దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. తన పరువు కోసం ప్రణయ్‌ను చంపడం వల్ల అమృతవర్షిణి తండ్రి మారుతీరావుకి ఒరిగిందేమీ లేదని, ఒకవేళ పరువు కోసమే ఈ హత్య చేయిస్తే అతడు చావడమే మేలని వ్యాఖ్యానించారు. 
 
పరువు కోసం ఎవరినైతే చంపిస్తారో, అలాంటివారిని చంపినపుడే నిజమైన పరువు హత్య అని రాంగోపాల్ వర్మ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అమృత తండ్రి కేవలం పిరికితనంతో కూడిన ఓ చెత్త నేరస్థుడని ఆయన వ్యాఖ్యానించారు.