1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (09:07 IST)

పెళ్లి చేసుకున్నందుకు కాదు... రిసెప్షన్ హంగామాతో రగిలిపోయిన మారుతిరావు...

మిర్యాలగూడ పట్టణంలో తన కుమార్తెను ఓ దళిత వర్గానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నందుకు అమృత తండ్రి కుమిలిపోలేదు. కానీ, తనకు పలుకుబడివున్న పట్టణంలో రిసెప్షన్ పేరుతో హంగామా చేయడంతో మారుతిరావు రగిలిపోయా

మిర్యాలగూడ పట్టణంలో తన కుమార్తెను ఓ దళిత వర్గానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నందుకు అమృత తండ్రి కుమిలిపోలేదు. కానీ, తనకు పలుకుబడివున్న పట్టణంలో రిసెప్షన్ పేరుతో హంగామా చేయడంతో మారుతిరావు రగిలిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. తనకు జరిగిన అవమానాలన్నింటికి ఏకైక కారణం ప్రణయ్.. అందుకే అతన్ని లేకుండా చేయాలని అమృత - ప్రణయ్ రిసెప్షన్ జరిగిన రోజునే నిర్ణయించుకున్నాడు.
 
ఆ తర్వాత తనకు పరిచయం ఉన్న నేరస్థులందరినీ సంప్రదించాడు. చివరకు గతంలో ఓ భూ వివాదంలో తనను కిడ్నాప్‌ చేసిన అబ్దుల్‌ బారీని ఇందుకు ఉపయోగించుకోవాలని భావించాడు. తొలుత ఫోన్లో అతన్ని సంప్రదించాడు. ఆ తర్వాత జూలై మొదటి వారంలో అబ్దుల్‌ కరీంను హైదరాబాద్‌లోని బారీ వద్దకు పంపాడు. 
 
బడేబాయ్‌ని తీసుకొని మూడు రోజుల్లో మిర్యాలగూడకు వస్తానని కరీంతో బారీ చెప్పాడు. చెప్పినట్లే.. అస్ఘర్‌, బారీ వచ్చారు. మారుతీ రావు, కరీం ఆటోనగర్‌ వెళ్లి కారులోనే కూర్చొని చర్చలు జరిపారు. తన కూతురి పెళ్లి విషయం చెప్పిన మారుతీరావు.. ఎలాగైనా ప్రణయ్‌ను అంతం చేయాలని ప్రాధేయపడ్డాడు. ఇందుకు అస్ఘర్‌, బారీలు రూ.2 కోట్లు డిమాండ్‌ చేయగా.. రూ.కోటి సుపారీ ఇచ్చేవిధంగా కరీం మాట్లాడాడు. ముందుగా రూ.50 లక్షలు ఇవ్వాలని బారీ కోరగా, తొలుత రూ.15 లక్షలను మారుతిరావు చెల్లించాడు. అలా ప్రణయ్ హత్యకు ప్లాన్ వేశాడు.