శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (20:53 IST)

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో విషాదం జరిగింది. ప్రేమించినవాడితో పెళ్లికి ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నది. ఆమె మృతి వార్త తెలియగానే అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే గ్రామానికి చెందిన లావణ్య,

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో విషాదం జరిగింది. ప్రేమించినవాడితో పెళ్లికి ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నది. ఆమె మృతి వార్త తెలియగానే అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే గ్రామానికి చెందిన లావణ్య, ఎల్లేశ్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 
 
తమ ప్రేమ గురించి లావణ్య పెద్దలకు చెప్పడంతో వారు పెళ్లికి  నిరాకరించారు. దీంతో మనస్థాపం చెందిన లావణ్య (19) కిరోసిన్ పోసుకొని నిప్పు అంటిచుకుంది. ఈ విషయం తెలిసి ఎల్లేశ్(21) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమికులు ఇద్దరూ మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.