మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (09:08 IST)

తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు...

చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన గౌహతిలో

చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన గౌహతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఐఐటీ గౌహతిలో కర్నాటకకు చెందిన నాగశ్రీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరింది. హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌‌కు ఉరి వేసుకొంది. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డులు గమనించి.. పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు... తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి మృతదేహాన్ని కిందికి దించారు. ఆమె బెడ్‌పై ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 'తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు' అంటూ అందులో పేర్కొంది.