మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (11:57 IST)

90 యేళ్ళ వయసులో పీహెచ్‌డీ.. స్వాతంత్ర్య సమరయోధుడు రికార్డు

చదువుకోవాలన్న జిజ్ఞాస ఉండాలేగానే వయసుతో పనిలేదని అంటారు. దీన్ని కర్ణాటకకు చెందిన 89 యేళ్ళ ఓ వృద్ధుడు నిరూపించాడు. ఆయన 9 పదుల వయసులో గౌరవ డాక్టరేట్ సంపాదించాడు. ఆయన పేరు శరణ్ బసవరాజ్ బిస్రాహలీ. భారత స్

చదువుకోవాలన్న జిజ్ఞాస ఉండాలేగానే వయసుతో పనిలేదని అంటారు. దీన్ని కర్ణాటకకు చెందిన 89 యేళ్ళ ఓ వృద్ధుడు నిరూపించాడు. ఆయన 9 పదుల వయసులో గౌరవ డాక్టరేట్ సంపాదించాడు. ఆయన పేరు శరణ్ బసవరాజ్ బిస్రాహలీ. భారత స్వాతంత్ర్య సమరయోధుడు. కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లావాసి.
 
తన జీవిత లక్ష్యమైన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్‌డీ)ని పూర్తిచేశారు. తన జీవితంలో బస్వరాజ్ ఏనాడూ ఓటమిని అంగీకరించలేదు. కర్నాటక యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన ఆయన అదే రాష్ట్రంలోని హంపీ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. అంతకుముందు బస్వరాజ్ 'లా' కూడా చదువుకున్నారు. ప్రస్తుతం బస్వరాజ్ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు రాసే పనిలో నిమగ్నమయ్యారు.