బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 10 సెప్టెంబరు 2018 (20:15 IST)

కర్నాటకలో దారుణం.... ప్రేమించి పెళ్లాడిన భార్య తల నరికేసిన భర్త

కర్ణాటకలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. షీమొగ జిల్లా చిక్‌మంగుళూరు తాలూకా శివాని గ్రామంలో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా తల నరికి చంపాడు ఓ భర్త. ఈ దారుణం చేసింది కాకుండా భార్య తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ లొంగిపోయాడు.

తను ప్రేమించి పెళ్లాడిన భార్య మంజుల మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా నరికి చంపానని పోలీసులకు తెలిపాడు. భర్త సతీష్ గతంలో పలుసార్లు ఇదే విషయమై తన భార్యతో వాద్వాదం చేశాడు. పలుమార్లు పోలీసు స్టేషను వరకూ వెళ్లింది విషయం. పోలీస్ స్టేషన్లో వారికి నచ్చచెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఐతే అదేమీ పట్టించుకోని సతీష్ తన భార్యను పొట్టనబెట్టుకున్నాడు. పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సతీష్, మంజులకు ఇద్దరు పిల్లలున్నారు.