బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (21:14 IST)

జుట్టు రాలిపోతోందని యువతి ఆత్మహత్య.. ఎక్కడ?

అందంగా ముస్తాబు కావడానికి ఆమె బ్యూటీపార్లల్‌కు వెళ్ళింది. జుట్టును ఆకర్షణీయంగా చేయించుకుంది. కానీ ఆ తరువాత కొద్దిరోజులకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. బ్యూటీపార్లల్‌లో అసలేం జరిగిందో అర్థంకాక పోలీసులు విచారణ చేపట్టారు.

కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన దివ్య ఒక హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. రెండు నెలల క్రితం మైసూరులోని ఒక బ్యూటీ పార్లల్‌లో జుట్టును అందంగా చేయించుకుంది. అయితే గత 15 రోజుల నుంచి జుట్టు ఊడిపోతూ వస్తోంది. 
 
జుట్టు మొత్తం ఊడిపోతే స్నేహితులు హేళన చేస్తారన్న భయంతో స్థానికంగా లక్ష్మణ తీర్థంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రెండురోజులుగా కుమార్తె ఫోన్ చేయకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ గదిలో తను ఎదుర్కొన్న సమస్యను లేఖ రాసి ఉంచింది యువతి.