శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (14:41 IST)

రైలు వాష్‌రూమ్‌లో ఆత్మహత్య.. వేలాడుతూ కనిపించాడు..

రైళ్ల వాష్‌రూమ్‌లు కూడా ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. తాజాగా మదురై- కాచిగూడ రైలులోని వాష్‌రూమ్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ వద్ద రైలుల

రైళ్ల వాష్‌రూమ్‌లు కూడా ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. తాజాగా మదురై- కాచిగూడ రైలులోని వాష్‌రూమ్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ వద్ద రైలులోని ఎస్-2 బోగిలో వాష్‌రూమ్‌కి వెళదామని కొందరు ప్రయాణికులు వచ్చారు.


కానీ వాష్‌రూమ్ తలుపులు వేసి వుంచడంతో బయటి నుంచి చూశారు. అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వేలాడుతూ కనిపించడంతో వెంటనే ప్రయాణీకులు టీటీకి సమాచారం అందించారు. 
 
రైలు కాచిగూడకు వచ్చిన తర్వాత రైల్వే పోలీసులు వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. మృతదేహన్ని కిందకి దించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని వద్ద టికెట్ లేకపోవడంతో ఏ స్టేషన్లో ఎక్కాడో.. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తో గుర్తించడం సాధ్యం కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.