శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: సోమవారం, 10 సెప్టెంబరు 2018 (15:35 IST)

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం, ముగ్గురు మృతి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఆర్టీసీ ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హెచ్‌సీయూ డిపోకు చెందిన

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఆర్టీసీ ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హెచ్‌సీయూ డిపోకు చెందిన బస్సు లింగపల్లి నుంచి కోఠి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని  ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు.. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.