'మహర్షి' విడుదల తేది వాయిదా.. నిరాశతో మహేశ్‌ ఫ్యాన్స్‌..?

Last Updated: శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:59 IST)
ప్రస్తుతం మహేశ్‌బాబు నటిస్తున్న మహర్షి చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇది మహేశ్ 25వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో మహేశ్‌కి జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. మూడవ వంతు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25వ తేదీనా చేస్తారని గతంలోనే ప్రకటించారు. కానీ, ఇప్పుడు చూస్తుంటే.. మహర్షి విడుదల తేదీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

మహర్షి షూటింగ్ ప్రారంభమైనప్పుడు సినిమాను ఏప్రిల్ 5వ తేదీ విడుదుల చేయాలని అనుకున్నారు. అయితే చిత్రీకరణలో ఆలస్యం కావడం వలన ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడేమో.. జూన్‌లో విడుదల చేయనున్నట్లు చెప్తున్నారు. ఈ వార్త మహేశ్ ఫ్యాన్స్‌కు ఎంతో కలిగిస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడంతో యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

ఈ సమ్మర్‌లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో మహర్షికి ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా కూడా సమ్మర్‌కు వచ్చేట్లు లేదని వారు నిరాశ చెందుతున్నారట. చిత్రం ఆలస్యం కావడానికి డైరెక్టర్ వంశీ పైడపల్లి కారణమని తెలుస్తోంది. క్వాలిట్ అవుట్ పేరుతో రోజులు గడిపేస్తున్నాడని సమాచారం. దానికి తోడుగా ముగ్గురు నిర్మాతలు ఉండడం కూడా సినిమా ఆలస్యానికి కారణంగా మారిందట. మొత్తానికి ఈ సమ్మర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురయ్యేలా ఉంది.దీనిపై మరింత చదవండి :