ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (17:19 IST)

తెలుగు 'విశ్వాసం' చిత్రం విడుదుల తేదీ ఖరారు..!

ఇటీవలే తమిళంలో విడుదలైన 'విశ్వాసం' చిత్రం ఘన విజయాన్ని సాధించిన విషయం అందరికి తెలిసిందే. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అజిత్ హీరోగా, నయనతార హీరోయిన్‌గా, జగపతి బాబు ప్రతనాయకుడిగా నటించారు. ఈ సినిమా.. తలా అజిత్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అజిత్ వరుస హిట్‌లతో దూసుకుపోతూ.. బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో వచ్చిన అజిత్.. వసూళ్ల మోత మోగించారు. 
 
ఇప్పటికి కూడా తమిళంలో 'విశ్వాసం' జోరు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పుడు తాజాగా కన్నడ భాషకు సంబంధించిన సెన్నార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. కన్నడ భాషలో వస్తున్న ఈ 'జగమల్ల' చిత్రం త్వరలోనే విడుదుల కానుంది.
 
ఇకపోతే, తెలుగులో కూడా ఈ సినిమా వచ్చే నెల అంటే.. మార్చి 1వ తేదీనా విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. విడుదల కార్యక్రమాలకు సంబంధించిన బిజినెస్ వ్యవహారమంతా త్వర త్వరగా జరుగుతున్నట్లు సమాచారం అందింది. అజిత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు.