సినిమాల కోసం థర్టీ ఇయర్స్ పట్టింది... వైకాపాలో సింగిల్ ఇయర్లో జాక్ పాట్

prithvi
Last Updated: శనివారం, 16 ఫిబ్రవరి 2019 (13:10 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో హాస్యనటుడు అలీ చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఆయన తెలుగుదేశం వైపు మొగ్గుచూపారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తాజాగా ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు వైకాపాలో కీలక పదవి తక్కింది. వైసీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీరాజ్‌ను నియమించారు.


హైదరాబాదులోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఇటీవల వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. 
 
ఇటీవల జగన్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పేందుకు కృషి చేస్తానని.. త్వరలో వీధి నాటకాలు ప్రదర్శిస్తానని పృథ్వీరాజ్ ప్రకటించారు. భీమవరం నియోజకవర్గం వీరవాసరం నుంచి జగన్‌ యాత్ర ప్రారంభమైంది. 
 
ప్రారంభంకాగానే పృథ్వీరాజ్‌.. జగన్‌ చేతిలో చేయి వేసి వైసీపీ జెండా భుజన వేసుకొని పాదయాత్రలో కొనసాగారు. ఇంకా పార్టీలో యాక్టివ్‌గా వుండే పృథ్వీరాజ్.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కారణంతోనే పృథ్వీరాజ్‌కు కీలక పదవి దక్కిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరింత చదవండి :