ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (19:34 IST)

రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీలో అదిరిపోయే పదవి.. ఏంటది..?

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీ టి.పిసిసికి సిద్థమైంది. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీలోని నేతలకు కొత్త పదవులు ఇచ్చి వారిని మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తోంది. కార్వనిర్వహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి కాస్త పెద్ద పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 
 
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందన్న విషయంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సంకేతాలిచ్చారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మాత్రం రాహుల్ గాంధీకి సంతృప్తిని ఇచ్చాయట. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో 88 పంచాయతీలకు గాను 66 పంచాయతీలను గెలుచుకున్నారట. దీంతో రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీకి నమ్మకం ఏర్పడిందట.
 
ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో రేవంత్ రెడ్డిని నిలబెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట రాహుల్ గాంధీ. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఆ పదవిలో ఉండటం ఏ మాత్రం ఇష్టం లేదట. అందుకే ఆ పదవికి రేవంత్ రెడ్డి అయితే కరెక్టన్న భావనలో ఉన్నారట రాహుల్ గాంధీ. మరి ఏం చేస్తారన్నది చూడాలి.