మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 13 డిశెంబరు 2018 (13:32 IST)

చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్‌ను నిండా ముంచింది... విజయశాంతి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతుందని తాను ముందే హెచ్చరించానని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి చెప్పారు. పొత్తు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మొదట తానే వ్యతిరేకించానన్న విషయాన్ని రాములమ్మ గుర్తు చేశారు. 
 
మెదక్ జిల్లా నుంచి తనను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆమె ఎన్నికల ఫలితాలపై ఆవేదన వ్యక్తం చేశారు.టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గెలిచేస్తామన్న ధీమాతో సొంత వ్యూహాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లోకి వెళ్లడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని రాములమ్మ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని తప్పుబట్టారు. 
 
పొత్తు వల్ల జరిగిన నష్టంపై త్వరలో కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదిక ఇస్తానని, కనీసం పార్లమెంటు ఎన్నికల నాటికైనా ఈ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.