శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: గురువారం, 27 డిశెంబరు 2018 (14:33 IST)

చంద్రబాబు రక్తంలో 70 శాతం కాంగ్రెస్... 30 ఇయర్స్ పృథ్వీ

సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వీగా పాపులర్ అయిన కామెడీ నటుడు పృథ్వీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంట్లో 70 శాతం మేర కాంగ్రెస్ పార్టీ రక్తం వున్నదని అన్నారు. ఇవాళ వైసీపీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిపిన వంచనపై గర్జన దీక్షలో పృధ్వీ మాట్లాడారు. 
 
ప్రత్యేకహోదాను ఆడపిల్ల అనీ, ప్యాకేజీని మగపిల్లాడు అంటూ పోలిక చేసి చెప్పిన ఘనుడు చంద్రబాబు నాయుడనీ, మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రత్యేక హోదా అంటున్నారో అర్థం కావడంలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి కారణంగానే ఏపీలో ప్రత్యేక హోదా డిమాండ్ సజీవంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని నేను ఇంతవరకూ చూడలేదని మండిపడ్డారు. తెలుగువాడిగా చంద్రబాబు పుట్టినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలని అన్నారు.