గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (14:54 IST)

పచ్చి అరటికాయను తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..?

పసుపు అరటిపండు సాధారణంగా అందరు తినేదే. కానీ, ఈ పచ్చరంగు అరటిపండును అంతగా తినడానికి ఇష్టపడరు. ఈ పండును తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు చాలా మెరుగుపడుతుంది. అంతేకాదు.. ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించుటలో ఈ అరటిపండు కంటే మించిన పండు లేదు.


అలానే పచ్చరంగు పచ్చి అరటికాయను ఎక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీనిని ఉడికించి తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. పచ్చి అరటిలోని ఫైబర్, విటమిన్స్, మినరల్స్ వంటివి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. 
 
అధిక బరువును తగ్గిస్తాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌కు తొలగిస్తాయి. ఈ పచ్చి అరటిని హోటల్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. 2010వ సంవత్సరంలో చేసిన పరిశోధనలో పచ్చి అరటికాయను డైట్‌లో చేర్చుకుంటే మధుమేహ వ్యాధి, గుండె సంబంధిత రోగాలు తగ్గించవచ్చని తెలియజేశారు. ఈ అరటికాయను తింటే కచ్చితంగా పైన తెలిపిన వ్యాధుల నుండి తప్పక విముక్తి లభిస్తుందని అధ్యయనంలో వెల్లడించారు. 
 
పచ్చి అరటికాయలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని బాగా శుభ్రం చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు కలిపి నూనెలో వేయించాలి. ఇలా చేసిన వాటిని స్నాక్స్ రూపంలో తీసుకుంటే మధుమేహ వ్యాధిని తగ్గించవచ్చును. అరటికాయలోని పొటాషియం మూత్రపిండిల్లోని రాళ్లను కరిగించుటకు ఎంతగానో దోహదపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.